Addam News
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 11:27 pm Posted by : Addam News

జ‌న‌గామ మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక నేప‌ధ్యంలో బిఆర్ఎస్ నాయ‌కుడు అజ్మీరా స్వామి నాయ‌క్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

జ‌న‌గామ మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక నేప‌ధ్యంలో
బిఆర్ఎస్ నాయ‌కుడు అజ్మీరా స్వామి నాయ‌క్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

జ‌న‌గామ‌, ఫిబ్రవరి 17, అద్దం న్యూస్ :  జ‌న‌గామ మున్సిపాలిటీ చైర్మ‌న్ ఎన్నిక నేప‌ధ్యంలో జిల్లాలో పోలీసులు ముంద‌స్తు అరెస్ట్‌లు చేశారు. జ‌న‌గామ మున్సిపాలిటీ మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ఎన్నిక సోమవారం వాయిదా ప‌డింది. జ‌న‌గామ మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక గ‌త రెండు రోజులుగా నాట‌కీయంగా మారింది. జిల్లాలో ఉద్రిక్త‌త ప‌రిస్థితి నెల‌కొంది. మంగ‌ళ‌వారం నూత‌న చైర్మ‌న్ ఎన్నిక నేప‌ధ్యంలో భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప‌లువురు బిఆర్ఎస్ నేత‌ల‌ను పోలీసులు ముంద‌స్తుగా అరెస్ట్‌లు చేశారు. లంబాడి హ‌క్కుల పోరాట స‌మితి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, బిఆర్ఎస్ పార్టీ జ‌న‌గామ జిల్లా నాయ‌కుడు అజ్మీరా స్వామి నాయక్ ను ఎర్ర‌గొల్ల ప‌హాడ్ గ్రామంలో ఆయ‌న నివాసం నుంచి జ‌న‌గామ పోలీసులు ముంద‌స్తుగా అరెస్ట్ చేశారు. అనంత‌రం జ‌నగామ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png