విమలక్క 50 గంటల ప్రజా కళాజాతర ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 26, ( అద్దం న్యూస్ ) : ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా సంస్కృతి వర్ధిల్లాలి, జానపద రూపాలను కాపాడుకోవాలని,,భూస్వామ్య పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విష సంస్కృతిని నశించాలని, సమసమాజం కావాలని, దోపిడి పీడన నశించాలని నినాదాలు చేస్తూ వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ వేలాది మంది ప్రజా కళాకారులతో ప్రజా కళాజాతర ర్యాలీ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు కొనసాగింది. దీనికి ఉభయ తెలుగు రాష్ట్రాల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు నాయకత్వం వహించారు....