Addam News
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 11:23 pm Posted by : Addam News

శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం వ‌ద్ద నూతన షెడ్డు ప్రారంభోత్సవం

శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం వ‌ద్ద నూతన షెడ్డు ప్రారంభోత్సవం

ముషీరాబాద్, ఫిబ్రవరి 15, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఆర్‌టిసి క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వ‌ద్ద దాతల సహకారంతో రూ.8 లక్షలతో నూతనంగా నిర్మించిన షెడ్డును ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాజ్యసభ సభ్యులు ఎం.అనిల్ కుమార్ యాదవ్, గాంధీనగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌లు హాజ‌రై ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి నర్సింగ్‌రావుతో క‌లిసి షెడ్డును ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ ఈఓ లక్ష్మా రెడ్డి, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ.వినయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జైసింహా, యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్, ఆల‌య క‌మిటీ స‌భ్యులు, కాంగ్రెస్ నాయ‌కులు శీలం సత్యనారాయణ, గుర్రం శంకర్, బాబ్జి, జగదీష్, సురేశ్ యాదవ్, నరేందర్ యాదవ్, సాల్మన్ రాజ్, నవీన్, బాబూరావు, సాయిరాం, యాదగిరి గౌడ్, కవిత, మధుమిత, శ్రీనివాస్, కిట్టు, డివిజన్ బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్, ఆనంద్‌రావు, బిజెపి నాయ‌కులు శ్రీకాంత్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, సురేష్, రాజు, సాయి గౌడ్, ప్రశాంత్, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు పోతుల శ్రీకాంత్‌, పున్న స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png