Addam News
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 2:23 am Posted by : Addam News

ప‌ద్మాకాల‌నీలో నాలా పై అసంపూర్తిగా స్లాబ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి – డివైఎఫ్ఐ

హైద‌రాబాద్‌, మే 31, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ ప‌ద్మాకాల‌నీలో నాలా పై అసంపూర్తిగా ఉన్న స్లాబ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ప్రమాదకరకంగా ఉన్న నాలా వద్ద రక్షణ గోడ నిర్మించాల‌ని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ( డివైఎఫ్ఐ ) నాయ‌కులు డిమాండ్ చేశారు. శ‌నివారం డివైఎఫ్ఐ జిల్లా కార్య‌ద‌ర్శి జావీద్ ప‌ద్మాకాల‌నీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు అదికారులు పూర్తి స్థాయిలో స్లాబ్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కొద్దీ దూరం నిర్మాణం చేసి వదిలేశార‌న్నారు. నిర్మాణం చేసిన స్లాబ్ చివరలో రక్షణ గోడ కూడా నిర్మాణం చేయలేదని విమర్శించారు. రక్షణ గోడ లేక పోవడం వల్ల స్థానికులు భయందోళనకు గురవుతున్నారన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో ఉన్నారని తెలిపారు. తక్షణమే పూర్తిగా స్లాబ్ నిర్మాణం చేపట్టాలని, అప్పటి వరకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజయ్య, సురేష్, వెంకటేష్, బ‌స్తీవాసులు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png