ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి – అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) : ఉస్మానియా ఆసుపత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రులకు సంబంధించి వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియను కూడా మొదలుపెట్టాలని చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంవో అధికారులతో జరిగిన సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన...