IND vs SA: నేడు రెండో టీ20..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తొలి టీ20లో సఫారీలను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. జోరు కొనసాగించాలనుకుంటున్న ఆతిథ్య జట్టు.. రెండో టీ20లో నేడు దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ సఫారీ జట్టు కూడా బలంగానే ఉన్న నేపథ్యంలో ఈ పోరు సూర్య బృందానికి తేలికేమీ కాదు. అయితే కటక్‌లో 101 పరుగుల విజయం ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాస్వాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ముల్లాన్‌పుర్‌లోని పీసీఏ కొత్త స్టేడియంలో...