IND w Vs SL: నేడు శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: జోరుమీదున్న టీమ్ ఇండియా మహిళల జట్టు మరో పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే రెండో టీ20లో శ్రీలంకను ఢీకొంటుంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో జరిగిన తొలి టీ20లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీలంకను 121/6కు కట్టడి చేసినప్పటికీ భారత జట్టు ఫీల్డింగ్, ముఖ్యంగా క్యాచింగ్‌ మెరుగుపడాల్సివుంది. తొలి మ్యాచ్‌లో జట్టు అయిదు క్యాచ్‌లు చేజార్చింది. ‘‘మేం మా ఫీల్డింగ్‌ మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టాం. పదే పదే ఎందుకు క్యాచ్‌లు చేజారుస్తున్నామో...