Addam News
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 2:24 pm Posted by : Addam News

హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, ఆగ‌స్టు 15, అద్దం న్యూస్ :    హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ ఘనంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు జాతీయ జెండాను ఎగుర‌వేసి జాతీయ గీతాన్ని ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా వారు స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన పోరాట సమరయోధులను స్మరించుకున్నారు. ఈ వేడుకలలో నగర గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎం.సుబ్బలక్ష్మి, ఎల్.చంద్రకళ, ఆఫీస్ సిబ్బంది వెంకటేశ్వర రెడ్డి, వెంకటేష్ యాదవ్, రామ్మోహన్, మహేందర్, అనిల్, మహేష్‌, జానకి రాములు, అమరావతి, కవిత, భాగ్య, శ్రీకాంత్, సునీత, బి.ప్రతిభా రెడ్డి, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యాలయ సిబ్బంది, సాంకేతిక విభాగం సిబ్బంధి, నగర గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, గ్రంధాలయ విద్యార్ధులు, గ్రంధాలయ పాఠకులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png