Addam News
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 4:59 am Posted by : Addam News

ముషీరాబాద్ ఆర్టీసీ డిపోలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

ముషీరాబాద్ ఆర్టీసీ డిపోలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ ఆర్టీసి డిపోలో శ‌నివారం భార‌త దేశ 80 వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. డిపో మేనేజ‌ర్ జె.విజ‌య్ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌ల్లో జాతీయ జెండాను ఎగుర‌వేసి, జాతీయ గీతాన్ని ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా డిపో మేనేజ‌ర్ జె.విజ‌య్ మాట్లాడుతూ… కార్మికుల‌కు స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని, త‌ద్వారా డిపో అభివృద్ధికి పాటుప‌డాల‌ని సూచించారు. గ‌త నెల జులై మాసంలో ఉత్త‌మ ఈపికె సాధించిన కండ‌క్ట‌ర్ల‌కు న‌గ‌దు పుర‌స్కారాల‌తో పాటు ప్ర‌శంసాప‌త్రాన్ని అంద‌చేశారు. అలాగే ఉత్త‌మ మెకానిక్‌ల‌ను ప్ర‌శంసాప‌త్రాల‌తో స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png