చిక్క‌డ‌ప‌ల్లిలో ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

చిక్క‌డ‌ప‌ల్లిలో ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

చిక్క‌డ‌ప‌ల్లి, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు, చిక్క‌డ‌ప‌ల్లి మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజ‌రై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా జాతీయ జెండాకు వంద‌నం చేసి జాతీయ గీతాన్ని ఆల‌పించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు చంద్ర‌మోహ‌న్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు చిన్నారులు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల వేష‌ధార‌ణ‌లో అల‌క‌రించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page