Addam News
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 9:39 pm Posted by : Addam News

బిఆర్ఎస్‌ పార్టీ, ఉద్యమ నాయకుడు బల్లెకరి రమేష్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుక‌లు

బిఆర్ఎస్‌ పార్టీ, ఉద్యమ నాయకుడు
బల్లెకరి రమేష్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుక‌లు

క‌వాడిగూడ‌, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు బ‌ల్లెక‌రి ర‌మేష్ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం గుడాల బ‌స్తీలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్‌, జిహెచ్ఎంసి స్టాండింగ్ క‌మిటీ మాజీ స‌భ్యుడు వి.శ్రీనివాస్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, తెలంగాణ ఉద్య‌మ‌కారులు బ‌ల్లెక‌రి ర‌మేష్‌, క‌ల్వ‌గోపి, బ‌ల్లెక‌రి రాములు, రేషం మ‌ల్లేష్‌, బండ జుగేంద‌ర్ కుర్మ‌, సిరిగిరి శ్యామ్‌, కావ‌లి సుధాక‌ర్, సామ‌ల శ్రీనివాస్‌, శివ‌, అభి, సంతోష్‌, శ్రీనివాస్‌, ల‌క్ష్మ‌ణ్‌, భాస్క‌ర్ త‌దిత‌రులతో క‌లిసి జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా జెండా వంద‌నం చేసి జాతీయ గీతాన్ని ఆల‌పించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png