Addam News
Newspaper Banner
Date of Publish : 27 November 2025, 4:11 am Posted by : Addam News

న‌గ‌ర గ్రంథాల‌యం సంస్థ‌లో ఘ‌నంగా భార‌త రాజ్యాంగ దినోత్స‌వం వేడుక‌లు

హైదరాబాద్, నవంబర్ 26, అద్దం న్యూస్ : డాక్ట‌ర్‌.బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రచించిన భార‌త రాజ్యాంగ దినోత్స‌వ కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యం సంస్థ‌లో జ‌రిగింది. ఈ కార్యక్రమానికి హైద‌రాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ హాజ‌రై అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎల్.చంద్రకళ, సాంకేతిక విభాగం సిబ్బంది కృష్ణా రెడ్డి, నగర గ్రంథాలయ సంస్థ సిబ్బంది శ్రీకాంత్, యాదమ్మ, అమరావతి, భాగ్యలక్ష్మీ, శ్రీకాంత్, మహేశ్వరి, హైద‌రాబాద్ నగర గ్రంథాలయ సంస్థ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png