11 ఏళ్ల మోది సుపరిపాలనలో ప్రపంచంలో భారత్ అత్యున్నత స్థాయికి చేరుకుంది – బిజెపి మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్‌గౌడ్
హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల సుపరిపాలనలో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి భారతదేశం చేరుకుందని బిజెపి మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్‌గౌడ్ అన్నారు. 11 ఏళ్ల మోది పాలనపై భారతీయ జనతా పార్టీ వికసిత భారత్ సంకల్ప సభ గాంధీనగర్ డివిజన్‌లోని అశోక్‌నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్‌లో జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భరత్ గౌడ్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజరయ్యారు....