IND vs SA: నేడు మూడో టీ20.. గెలుస్తారా..?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికాతో 5 టీ20ల సిరీస్‌ను ఘనవిజయంతో ఆరంభించి, రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమ్‌ఇండియా.. కీలకమైన మూడో టీ20కి సిద్ధమైంది. ఆదివారం ధర్మశాలలో ఈ మ్యాచ్‌ జరగనుంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్, వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ల ఫామే భారత్‌కు అతి పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా గిల్‌ ఈ సిరీస్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతే జట్టులో చోటు గల్లంతవడం ఖాయం. బ్యాటింగ్‌ ఆర్డర్లో ప్రయోగాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జట్టు యాజమాన్యం.. ఈ మ్యాచ్‌లో ఎవరిని ఏ స్థానంలో...