Addam News
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 4:19 pm Posted by : Addam News

భారతీయ సంఘ సంస్కర్త, కుల వ్యతిరేక ఉద్యమకారుడు జ్యోతిరావు ఫులే

భారతీయ సంఘ సంస్కర్త, కుల వ్యతిరేక ఉద్యమకారుడు జ్యోతిరావు ఫులే
– రాజ్యసభ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్

హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్ :   భారతీయ సంఘ సంస్కర్త, కుల వ్యతిరేక ఉద్యమకారుడు మ‌హాత్మా జ్యోతిరావు ఫులే అని రాజ్యసభ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అరుంధ‌తిన‌గ‌ర్ బ‌స్తీలో మ‌హాత్మా జ్యోతిరావు ఫులే జ‌యంతి కార్య‌క్ర‌మం శ‌నివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌, మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు జ్యోతిరావు ఫులే విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్‌ మాట్లాడుతూ… ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త, కుల వ్యతిరేక ఉద్యమకారుడు, మహిళా విద్యాదాత అయిన ఫులే అని అన్నారు. నిమ్న కులాల, మహిళల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారనీ ఫూలే సేవలను గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, కార్యదర్శి సలంద్రి శ్రీనివాస్ యాదవ్, ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం.ఉమేష్, డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆనంద్ రావు, నాయ‌కులు శ్రీకాంత్, పాల శ్రీనివాస్, సత్తి రెడ్డి, నీరజ్‌, అరుంధతి బస్తీ నాయకులు శ్రీనివాస్, యాదగిరి, రాజ్ కుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png