మరో భారతీయ విద్యార్థి దారుణ హత్య..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కెనడాలోని టొరంటోలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు ఇలా తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కెనడాలోని టొరంటో నగరంలో ఉన్న స్కార్‌బొరౌగ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్న శివాంక్ అవస్థిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. స్థానిక హైల్యాండ్ క్రీక్ ట్రైల్ సమీపంలో ఈ దుశ్చర్య జరిగింది. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితులు అక్కడి నుండి పరారయ్యారు....