Addam News
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 7:26 am Posted by : Addam News

Instagram: ఇన్‌స్టాగ్రామ్ అవుటేజ్.. గంటల తరబడి సేవలు బంద్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఆదివారం నాడు సాంకేతిక సమస్యలతో సతమతమైంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో, యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాగిన్ అవ్వడం, ఫీడ్ రీఫ్రెష్ చేయడం వంటి సాధారణ పనులు కూడా చేయలేక వినియోగదారులు నిరాశకు గురయ్యారు.

‘డౌన్‌డిటెక్టర్’ (DownDetector) వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం, అమెరికా కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఈ సమస్య తీవ్రరూపం దాల్చింది. యాప్ (Instagram) ఓపెన్ చేయగానే ఖాళీ స్క్రీన్ మాత్రమే కనిపిస్తోందని, ‘కుడ్ నాట్ రీఫ్రెష్ ఫీడ్’ (Could not refresh feed) అనే మెసేజ్ వస్తోందని అనేక మంది సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. సుమారు 45 శాతం మంది యాప్ పనితీరుపై, 41 శాతం మంది లాగిన్ సమస్యలపై ఫిర్యాదు చేశారు.

అయితే భారతీయ వినియోగదారులపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంది. కేవలం పది మంది మాత్రమే (Instagram) సమస్యను రిపోర్ట్ చేసినట్లు సమాచారం. ఈ అంతరాయానికి గల కారణాలపై మెటా (Meta) ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తరచూ ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడం పట్ల నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png