Instagram: ఇన్‌స్టాగ్రామ్ అవుటేజ్.. గంటల తరబడి సేవలు బంద్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఆదివారం నాడు సాంకేతిక సమస్యలతో సతమతమైంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో, యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాగిన్ అవ్వడం, ఫీడ్ రీఫ్రెష్ చేయడం వంటి సాధారణ పనులు కూడా చేయలేక వినియోగదారులు నిరాశకు గురయ్యారు. ‘డౌన్‌డిటెక్టర్’ (DownDetector) వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం, అమెరికా కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఈ సమస్య తీవ్రరూపం దాల్చింది. యాప్ (Instagram) ఓపెన్ చేయగానే ఖాళీ స్క్రీన్ మాత్రమే కనిపిస్తోందని, ‘కుడ్ నాట్ రీఫ్రెష్ ఫీడ్’...