ఉప ఎన్నిక నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు – రూ.10 లక్షలకు పైగా నగదు స్వాధీనం
ఉప ఎన్నిక నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు – రూ.10 లక్షలకు పైగా నగదు స్వాధీనం హైదరాబాద్, అక్టోబర్ 15, అద్దం న్యూస్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల పర్యవేక్షణ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో 10 లక్షల రూపాయలకు పైగా అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నాయి. అధికారుల వివరాల ప్రకారం, ఫ్లయింగ్ స్క్వాడ్ 3 A బృందం అమీర్‌పేట్ ఎక్స్ రోడ్డులో వాహనాన్ని ఆపి రూ.1.50 లక్షలు...