Addam News
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 6:54 pm Posted by : Addam News

బోనాల జాత‌ర‌కు రావాల‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావుకు ఆహ్వానం

బోనాల జాత‌ర‌కు రావాల‌ని
మాజీ మంత్రి హ‌రీష్‌రావుకు ఆహ్వానం

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 5, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్‌లో ఈ నెల 10 వ తేదీన బోనాల జాత‌ర‌ జ‌రుగ‌నుంది. ఈ నేప‌ధ్యంలో బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో బోనాలు, పోత‌రాజుల విన్యాసాలు, ఫ‌ల‌హారం బండ్ల ఊరేగింపు జ‌రుగ‌నుంది. ఈ నేప‌ధ్యంలో బుధ‌వారం మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావును రేషం మ‌ల్లేష్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఈ నెల 10 వ తేదీన జ‌రుగ‌నున్న‌ ఊరేగింపున‌కు రావాల‌ని ఆహ్వాన ప‌త్రిక‌ను హ‌రీష్‌రావుకు అంద‌చేశారు. హ‌రీష్ రావును క‌లిసిన వారిలో బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, సిరిగిరి శ్యామ్‌, క‌ల్వ‌గోపి, అజ‌య్ ముదిరాజ్‌, చిట్టి శ్యామ్ సుంద‌ర్‌, జుగేంద‌ర్‌, రేషం మ‌ణికంఠ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png