
హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 17, ( అద్దం న్యూస్ ) :
దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు పాల్గొనాలని హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయం వ్యవస్థాపక చైర్మన్ గోల్కొండ గౌతమ్ కుమార్, ఆలయ కార్యనిర్వాహణాధికారి పి.మహేందర్ గౌడ్, ఆలయ ముఖ్య అర్చకులు సాత్విక్ శర్మ లు కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డిని, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ లను కలిసి ఆహ్వానపత్రికలను అందచేశారు. కట్ట మైసమ్మ దేవాలయంలో జరుగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంగ ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు.
