Addam News
Newspaper Banner
Date of Publish : 22 March 2025, 2:26 pm Posted by : Addam News

ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందా – ఒకరి అరెస్ట్ 

హైదరాబాద్ స్పోర్ట్స్ డెస్క్, అద్దం న్యూస్ : నేటి సాయంత్రం ఉప్పల్ లో ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్ మ్యాచ్ లు అనగానే అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రజల్లో ఉన్న ఆ క్రేజ్ ను కొంత మంది దళారులు క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ దందాకు తెర లేపారు. ఉప్పల్ లో హైదరాబాద్- రాజస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో టికెట్లు బ్లాక్ లో విక్రయం చేస్తున్నారు. ఉప్పల్ లో మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్ ను ఎస్ఓటీ అధికారులు అరెస్ట్ చేశారు. భరద్వాజ్ నుంచి ఐపీఎల్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. భరద్వాజ్ తో పాటు ఐపీఎల్ టికెట్లను ఉప్పల్ పోలీసులకు ఎస్ఓటీ అధికారులు అప్పగించారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png