ISRO: ఇస్రో బాహుబలి ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి ‘బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2’

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌-షార్‌ నుంచి బుధవారం చేపట్టిన బాహుబలి రాకెట్‌ ‘ఎల్‌వీఎం3-ఎం6’ ప్రయోగం (ISRO Bahubali Rocket) విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్‌ ఉపగ్రహం ‘బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2 (BlueBird Block-2)’ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు. ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇస్రో...