పార్ట్ టైమ్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి –ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు వినతిపత్రం

తార్నాక, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైమ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్‌లకు వినతిపత్రం సమర్పించారు. పార్ట్ టైమ్ అధ్యాపకులకు 12 నెలల పాటు కన్సాలిడేటెడ్ వేతనం చెల్లించాలని, యూనివర్సిటీ నియామకాల్లో 1:50 నిష్పత్తి ప్రకారం ఇంటర్వ్యూలకు పిలవాలని, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూల్లో వెయిటేజీ కల్పించాలని వారు కోరారు. దీనిపై ఉన్నత...