బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కై నోటిఫికేషన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం
– తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 29, అద్దం న్యూస్ : ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కై నోటిఫికేషన్ ఇవ్వడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అధికార పార్టీ బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా అన్ని అవంతరాలను ఎదుర్కొని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో కూడిన నోటిఫికేషన్‌ను విడుదల చేసినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అవసర మంత్రివర్గానికి అభినందనలు తెలియజేస్తున్నట్లు పులిగారి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. దసరా పండుగతో పాటు ఓట్ల పండుగ గ్రామ గ్రామాల్లో జరుపుకుంటూ ఒక వర్గంపై మరో వర్గం దూషణలకు, రాజకీయ విమర్శలకు స్వస్థ పలకాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య సామరస్య పూర్వకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలుపంచుకోవాలని, తెలంగాణ గ్రామీణ ప్రాంత అభివృద్ధికై కంకణ బద్ధులవుతారని కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png