రిజర్వేషన్ల‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేయ‌డం సరికాదు

రిజర్వేషన్ల‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేయ‌డం సరికాదు
– రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 22, ( అద్దం న్యూస్ ) :   రిజర్వేషన్ల‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేయ‌డం సరికాదని రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య అన్నారు. హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్‌లోని బిసి భ‌వ‌న్‌లో శ‌నివారం జ‌రిగిన స‌మావేశంలో ఆర్‌.కృష్ణ‌య్య మాట్లాడుతూ… నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అగ్రకులాల వారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చెపట్టడం అన్యాయం – దుర్మార్గం అని అన్నారు. ఈ ఉద్యమాల ఆటలు కొనసాగునివ్వమ‌ని, మానుకోకపోతే ప్రతి ఘటన ఉద్యమం తప్పదని హెచ్చరించారు. 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను కొన్ని వందల సంవత్సరాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అణిచివేశారన్నారు. స్వాతంత్య్రం తర్వాత రిజర్వేషన్లు పెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే ఈ కులాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. వీరి అభివృద్ధి ఓర్వలేక రిజర్వేషన్లు ర‌ద్దు చేయాలని ఆందోళనకు దిగడం సమంజసం కాదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే ప్రతిఘటన ఉద్యమాలు అంతకంటే భారీ ఎత్తున చేస్తామన్నారు.

అగ్రకుల సోదరులు బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే ప్రతి ఘటన ఉద్యమాలు అంతకంటే భారీ ఎత్తున చేస్తామని తెలిపారు. గతంలో మన రాష్ట్రంలో వచ్చిన 1986 ఉద్యమం, 1990లో వచ్చిన మండల కమిషన్ ఉద్యమం సందర్భంగా అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేశాయని అప్పుడు బిసి లు యూనివర్సిటీలను ఖాళీ చేయించి తరిమి తరిమి కొట్టి పంపామ‌ని ఆర్‌.కృష్ణ‌య్య తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ నాయకత్వంలో భారత దేశం అగ్ర దేశం వైపు పరుగులు తీస్తుందని, ఇలా అంటే సరైన కాలంలో సమాజాన్ని చీల్చి ప్రయత్నాలు కుట్రలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ క‌న్వీన‌ర్ సి.రాజేంద‌ర్‌, బిసి కులాల ఐక్య వేదిక అధ్య‌క్షుడు అనంత‌య్య‌, బాల‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page