తెలంగాణ ఉద్యమకారుల సేవలను స్మరించుకోవడం ప్రతి తెలంగాణ పౌరుడి బాధ్యత
తెలంగాణ ఉద్యమకారుల సేవలను స్మరించుకోవడం ప్రతి తెలంగాణ పౌరుడి బాధ్యత – మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, జూన్ 3, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాధన కోసం నిరంతరం పోరాడి, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను సన్మానించడం ఆనందదాయకమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అన్నారు. అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభలో ముఖ్య అతిథిగా...