తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తెలుగుకు రూ.12 కోట్లను కేటాయించడం దురదృష్టకరం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ :    తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తెలుగుకు రూ.12 కోట్లను కేటాయించడం దురదృష్టకరమ‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి. సాయిబాబా అన్నారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు ఏటా కొంత నిధులను కేటాయిస్తుంది. గత పదేళ్లలో వీటి కోసం ఎంత ఖర్చు చేసిందో ఆర్టీఐ వెల్లడించింది. 2014-2025 మధ్య కాలంలో సంస్కృత భాష కోసమే ఏకంగా రూ.2,532...