స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేయడం దురదృష్టకరం – రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) : స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని, బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణే శాశ్వత పరిష్కారమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తే చంద్రబాబు...