గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణను పరిశీలించిన జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్
ముల్లకత్వ చెరువు ఎస్టీపీ, గ్రీన్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ # శుద్ధి చేసిన నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం # ఎయిర్ టెక్ మిషన్లలో తాగునీటికి బదులుగా శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచన హైదరాబాద్ బ్యూరో, ( అద్దం న్యూస్ ) : జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ( జేఎండీ ) మయాంక్ మిట్టల్ మంగళవారం ముల్లకత్వ చెరువు మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ( ఎస్టిపి ) సందర్శించి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల...