ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించిన జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్
హైదరాబాద్, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ మహానగరంలో రాబోయే వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి లభ్యతపై సవాళ్లు ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జలమండలి ముందస్తు చర్యలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ గురువారం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకు సంబంధించిన నీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా గండిపేట, హిమాయత్‌సాగర్‌లోని ప్రెజర్ ఫిల్టర్లు, గండిపేటలో ప్రతిపాదించిన అదనపు 10 ఎంఎల్డీ సామర్థ్యం గల ప్రెజర్ ఫిల్టర్ల ఏర్పాటు స్థలం, బుద్వేల్లోని...