మలక్‌పేట్ సీవరేజ్ సమస్య ప్రాంతాన్ని పర్యటించిన జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 3, అద్దం న్యూస్ :   మలక్‌పేట్‌ నల్గొండ చౌరస్తాలో సీవరేజ్ మరమ్మత్తు పనులను మంగ‌ళ‌వారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి పరిశీలించారు. మలక్‌పేట్ అక్బ‌ర్‌ ప్లాజా వద్ద మురుగు సమస్య తలెత్తి ట్రాఫిక్ ఆటంకం ఏర్పడింది. దీంతో జలమండలి అధికారులు పర్యటించి రెండు దశాబ్ధాల‌ క్రితం సీవ‌రేజ్‌ లైను శిథిలమైపోవడంతో అవుట్‌లెట్ లేక‌ వర్షం కురిసిన సమయాల్లో సీవ‌రేజ్‌ రహదారిపై పొంగుతున్నట్టు గుర్తించారు. ఇదే ప్రాంతంలో జీహెచ్ఎంసీ వాననీటి కాలువ ఉండడం, ట్రాఫిక్ రద్దీ ఉండడం, సీవ‌రేజ్‌ లైన్లు ధ్వంసమైన ప్రాంతాన్ని ఖచ్చితంగా...