Addam News
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:45 am Posted by : Addam News

గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్లను పరిశీలించిన జలమండలి జేఎండీ

 దుర్గం చెరువు, ఖాజాగూడ ఎస్‌టిపీల్లో జేఎండీ మయాంక్ మిట్టల్ తనిఖీలు
# గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సరఫరా రికార్డులు, ఫ్లో మీటర్ల పరిశీలన
# శుద్ధి చేసిన నీటి సరఫరా పరిమాణాన్ని పెంచాలని అధికారులకు ఆదేశం
# డిజిటల్ బోర్డుల్లో నీటి నాణ్యతా ప్రమాణాల పరిశీలన

హైద‌రాబాద్‌, ( అద్దం న్యూస్ ) :    జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ సోమవారం దుర్గం చెరువు, ఖాజాగూడ మురుగునీటి శుద్ధి కేంద్రాలను ( ఎస్‌టిపీలు ) సందర్శించి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్ల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీటి పరిమాణం, ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఫిల్లింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఫ్లో మీటర్ల పనితీరును పరిశీలించి, శుద్ధి చేసిన నీటి సరఫరా పరిమాణాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. దుర్గం చెరువు ఎస్‌టిపీలో ఏర్పాటు చేసిన డిజిటల్ డిస్‌ప్లే బోర్డులో ప్రదర్శిస్తున్న శుద్ధి జలాల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత ప్రమాణాలను పాటించాలని సూచించారు. తాగునీటి సంరక్షణలో భాగంగా నిర్మాణాలు, గార్డెనింగ్, ఇతర తాగేతర అవసరాలకు గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు.