Addam News
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 7:42 am Posted by : Addam News

Jana Nayagan: నిరాశలో విజయ్ ఫ్యాన్స్‌..

Jana Nayagan: నిరాశలో విజయ్ ఫ్యాన్స్‌..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ విజయ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్‌’ (Jana Nayagan). హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ను సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సెన్సార్‌ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాలతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని పేర్కొంది.

విజయ్ ఫ్యాన్స్‌కి షాక్.. సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసిన ‘జన నాయగన్’ మూవీ వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాలతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కొత్త తేదీ త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. విజయ్ చివరి సినిమాకి ఇలా ఆటంకాలు ఎదురవ్వడంపై ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png