ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి – హైదరాబాద్ కలెక్టర్ కు జన సమితి వినతి

హైదరాబాద్, జూన్ 16, అద్దం న్యూస్ :     తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కు తెలంగాణ జన సమితి వినతి పత్రం సమర్పించింది. సోమవారం గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.నరసయ్య నేతృత్వంలో ప్రతినిధి బృందం కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఉద్యమకారులను గుర్తించాలని విజ్ఞప్తి...