తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జర్నలిస్ట్ అఖిలేష్
తిరుపతి, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఏడుకొండలవాడ స్వామిని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు, సాక్షి సీనియర్ జర్నలిస్ట్ చిలుకూరి అఖిలేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వామివారి దయతో మనందరిపై, మన కుటుంబాలపై ఆ శ్రీవేంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ స్వామిని మనసారా ప్రార్థించుకున్నానన్నారు. శ్రీనివాసుని దివ్య మంగళ రూపాన్ని కళ్లారా దర్శించుకున్న ఈ క్షణం నా జీవితంలో...