ఉద్యమంలో పాల్గొని వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలి – తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

న‌కిరేక‌ల్ బ్యూరో, అద్దం న్యూస్ : ఉద్యమంలో పాల్గొని వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలని తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ డిమాండ్ చేసింది. ఈ నెల 13వ తేదీన సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో తెలంగాణ జ‌ర్న‌లిస్టు ఫ్రంట్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న జ‌ర్న‌లిస్టుల స‌మ్మేళ‌నానికి సంబంధించిన పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం న‌కిరేక‌ల్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ బైరాగి, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు వేముల యాదగిరి,...