ప్రశాంతంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక – 48.7 శాతం పోలీంగ్
హైదరాబాద్, నవంబర్ 11, అద్దం న్యూస్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, దివ్యాంగులు సౌకర్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లను చేశారు. 48.7 శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు తెలిపారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో ఏడో అంతస్తులో ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ పర్యవేక్షణ, పిఆర్ఓ యాప్ ఇన్ ఈసీఐ నెట్ కంట్రోల్...