జులై 9 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి – తెలంగాణ రాష్ట్ర ఆటో మోటార్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు
హైదరాబాద్, జూన్ 25, అద్దం న్యూస్ : జులై 9 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో మోటార్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్ విద్యానగర్ మార్క్స్ భవన్‌లో టియుసిఐ అనుబంధ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రవీణ్ అధ్యక్షతన ఆటో మోటార్ సంఘాల రాష్ట్ర ఐక్య కార్యచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టియుసిఐ, ఐఎన్‌టియుసి, ఏఐటీయూసీ, సిఐటియు, బిఆర్‌టియు, టిఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు సంఘాల...