ఘనంగా కె.దేవేందర్ జన్మదిన వేడుకలు

బన్సీలాల్ పేట్, అక్టోబర్ 19, ( అద్దం న్యూస్ ) :     స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు కె.దేవేందర్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మాజీమంత్రి, సనత్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కార్యాలయంలో దేవేందర్ కు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు దేశపాక శ్రీనివాస్, విజయశంకర్, ఓ.రాజు, సత్యనారాయణ, జగదీష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.