Addam News
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 11:44 pm Posted by : Addam News

కాలేరు వెంకటేశం సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయం – ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌

కాచిగూడ, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) :    బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు, సంఘసేవకుడు, రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ కాలేరు వెంకటేశం ( 81 ) సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అంబర్‌పేట‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ అన్నారు. అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గం గోల్నాక డివిజన్ బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు కాలేరు రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నెహ్రునగర్ లో ఏర్పాటు చేసిన కాలేరు వెంకటేశం వర్ధంతి సభలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, గోల్నాక మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మ వెంకటేష్‌, మాజీ సర్పంచ్ రఘురామయ్య, వివిధ రాజకీయ నాయకులు, స్నేహితులు, కుల బంధువులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం పేదలకు అన్నదానం, పండ్లు, బ్రెడ్‌ ప్యాకెట్లను పంపిణి చేశారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాలేరు వెంకటేశం అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంతోశ్, శ్రీకాంత్, రాఘవ, స్వర్ణలత, మౌనిక, హారిక, ప్రియాంక, ఆర్ కే బాబు, రెడపాక రాము, సురేశ్ గౌడ్, నాగేందర్ బాబ్జీ, ఎన్.కృష్ణంరాజు, ఎన్. రమణ, కాలేరు భరత్, ఎన్.విశ్వనాథ్, భరత్ ముదిరాజ్, కాలేరు రాజు, దేవేందర్, వెంకులు, రాజన్, అప్ప శ్రీను, మైకిల్ తదితరులు పాల్గొన్నారు.