Addam News
Newspaper Banner
Date of Publish : 12 November 2025, 3:19 am Posted by : Addam News

క‌మ‌నీయంగా తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణోత్సవం

హైదరాబాద్, న‌వంబ‌ర్ 11, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం మంగ‌ళ‌వారం పదకొండవ రోజు కూడా ఘనంగా జరిగింది. శంఖారావంతో మొదలైన ఈ కార్యక్రమం శ్రీ శ్రీ అలమేలు మంగ సార్వయ స్మార్థ వేదపాఠశాల, బుద్వేల్ వారిచే వేద పఠనం జరిగింది. ఆ తర్వాత ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం జరిగింది. చాగంటి కోటేశ్వరరావు చే ప్రవచనం కార్యక్రమాన్ని భక్తులు ఎంతో శ్రద్ధగా విన్నారు. వేదిక పై నాగర్‌కోయిల్ నాగేంద్ర పూజ, సుబ్రహ్మణ్యస్వామికి కావడి ఉత్సవం భక్తులచే సుబ్రహ్మణ్య విగ్రహాలకు కోటి పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణోత్సవం చాలా ఘనంగా జరిగింది. కల్యాణోత్సవం జరుగుతున్న సమయంలో శ్రీశైల జగద్గురు శ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్యస్వామి, కాసర్‌గోడ్ యడనీర్ మఠం శ్రీ సచ్చిదానందభారతి స్వామి వచ్చారు. పదకొండవ రోజు ముఖ్య అతిధి గా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png