క‌మ‌నీయంగా తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి కళ్యాణోత్సవం

హైదరాబాద్, న‌వంబ‌ర్ 11, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం మంగ‌ళ‌వారం పదకొండవ రోజు కూడా ఘనంగా జరిగింది. శంఖారావంతో మొదలైన ఈ కార్యక్రమం శ్రీ శ్రీ అలమేలు మంగ సార్వయ స్మార్థ వేదపాఠశాల, బుద్వేల్ వారిచే వేద పఠనం జరిగింది. ఆ తర్వాత ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం జరిగింది. చాగంటి కోటేశ్వరరావు చే ప్రవచనం కార్యక్రమాన్ని భక్తులు ఎంతో శ్రద్ధగా విన్నారు. వేదిక పై నాగర్‌కోయిల్ నాగేంద్ర పూజ, సుబ్రహ్మణ్యస్వామికి కావడి ఉత్సవం భక్తులచే సుబ్రహ్మణ్య...