Addam News
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 3:05 am Posted by : Addam News

వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో ప్రారంభ‌మైన కార్తీక మాస ప‌విత్రోత్స‌వాలు

గాంధీన‌గ‌ర్‌, న‌వంబ‌ర్ 11, ( అద్దం న్యూస్ ) :

హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో కార్తీక మాస ప‌విత్రోత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. డిసెంబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్న కార్తీక‌మాస ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా బుధ‌వారం ఆల‌యంలో మ‌హాన్యాస‌పూర్వ‌క ఏక‌వార రుద్రాభిషేకాలు, ఏక‌వార రుద్రాభిషేకాలతో పాటు ఆకాశ దీపోత్స‌వాన్ని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హించారు. ఈ పూజ‌ల్లో ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి పి.కొమ్మాలు, ఆల‌య పున‌ర్నిర్మాణ క‌మిటీ చైర్మ‌న్ జాన‌కి సుధాక‌ర్ లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… కార్తీక మాస ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా ప్ర‌తి ప్ర‌త్యేక పూజ‌ల‌తో పాటు ప్ర‌తి సోమ‌వారం ప్ర‌దోష‌కాల‌పూజ‌, ఈ నెల 21వ తేదీన శ్రీ తుల‌సి కృష్ణ క‌ల్యాణం, 24వ తేదీన సామూహిక శ్రీ స‌త్య‌నారాయ‌న స్వామి వ్ర‌తాలు, అదు రోజు రాత్రి 7 గంట‌లకు జ్వాలా తోర‌ణం, డిసెంబ‌ర్ 7వ తేదీన మాస శివ‌రాత్రి సంద‌ర్భంగా శ్రీ శివ పార్వ‌తుల క‌ల్యాణోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

     ఈ పూజ‌లో ఆల‌య ముఖ్య అర్చ‌కుడు బుగ్గా ల‌క్ష్మీప‌తి శ‌ర్మ‌, అర్చ‌కుడు కందాళ వేంక‌టాద్రి, దేవాల‌య పున‌ర్నిర్మాణ క‌మిటీ స‌భ్యులు శ్యామ్ కుమార్ ముదిరాజ్‌, ప‌ద్మావ‌తి, నిర్మ‌ల‌, రామ‌కృష్ణ‌, హ‌రీష్‌, నీతారాణి, ల‌క్ష్మీ నారాయ‌ణ రావు, సుబ్బారావు, బాల‌కుమార్‌, న‌వీన్ ప్ర‌సాద్‌, శిశు కుమార్‌, ప్ర‌తాప్ కుమార్‌, లోక్‌నాథ్‌, వెంక‌ట్రావు, గ‌ణేష్‌, రామ‌కోటేశ్వ‌ర‌రావు, మోహ‌న్ రావు, ఆల‌య సిబ్బంది, భ‌క్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.