సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో క‌వి స‌మ్మేళ‌నం

గాంధీన‌గ‌ర్‌, ( అద్దం న్యూస్ ) : హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లి వట్టికోట ఆళ్వార్‌ స్వామి నగర కేంద్ర గ్రంథాలయంలో 59 వ గ్రంధాలయ వార్షికోత్సవ సందర్భంగా గ్రంధాలయాల ప్రాముఖ్యత పుస్తక పఠనం, అంశాలపై జరిగిన కవి సమ్మేళనం జ‌రిగింది. 17 మంది కవులు పాల్గొని కవిత గానం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ కార్యదర్శి ఎం.అలివేలు హాజ‌ర‌య్యారు. ఆమెతో పాటు గ్రేడ్-1 లైబ్రేరియన్ ఎల్.చంద్రకళ, గ్రంధాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తంగెళ్లపల్లి కనకాచారి కవి సమ్మేళనాన్ని నిర్వహించగా.....