క‌మ‌నీయంగా కాజీపేట శ్రీ శ్వేతార్కమూల గణపతి కల్యాణోత్సవం

హైద‌రాబాద్‌, ( అద్దం న్యూస్ ) :   హైదరాబాద్ న‌గ‌రంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం బుధ‌వారం ఐదో రోజుకు చేరింది. ఇందులో భాగంగా వేదపఠనం, మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం, భక్తిగీతాలు, వీణా వాయిద్యం, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు.  రేజింతల్ శ్రీ సిద్ధివినాయకస్వామికి భక్తులచే కోటిగరికార్చన నిర్వహించారు. కాజీపేట శ్రీ శ్వేతార్కమూల గణపతి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్‌కు చెందిన శ్రీ సర్వేశానందస్వామి, శ్రీ సాక్షిరూపానందస్వామి పీఠాధిపతులుగా పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి తంగిరాల మాధవి దేవి ముఖ్య...