Addam News
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 8:53 pm Posted by : Addam News

KCR :  సిట్ విచార‌ణ‌కు రాలేను – సిట్‌కు రిప్లై ఇచ్చిన కేసీఆర్‌

KCR :  సిట్ విచార‌ణ‌కు రాలేను
– సిట్‌కు రిప్లై ఇచ్చిన కేసీఆర్‌

అద్దం న్యూస్, వెబ్ డెస్క్ :   ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, భారత్ రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ ) అధినేత కేసిఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రేపు ( 30 వ తేదీన ) విచార‌ణ చేస్తామ‌ని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా సిట్‌కు కెసిఆర్ బ‌దులు ఇచ్చారు. రేపు సిట్‌ విచారణకు రాలేను.. మున్సిపల్‌ ఎన్నికలు ఉన్నందున అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నానని… సమయం ఇవ్వాల‌ని కెసిఆర్ కోరారు. విచారణ వాయిదా వేసి మ‌రో తేదీని తెలుపాల‌ని కోరారు. ఈ మేరకు కెసిఆర్ రెండు పేజీల లేఖ ద్వారా కోరారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లోనే విచారించాలి.. విచారణకు సహకరిస్తానని కెసిఆర్ స్ప‌ష్టం చేశారు. phone tapping case

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png