ఎర్రవెల్లి, అక్టోబర్ 20, ( అద్దం న్యూస్ ) :
తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో కేసీఆర్ సాంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధపూజ నిర్వహించారు. శమీ వృక్షానికి కెసిఆర్ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు తదితర కుటుంబ సభ్యులతో పాటు మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, జహంగీర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

![]()