Addam News
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 2:59 am Posted by : Addam News

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేదాసి మోహన్

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేదాసి మోహన్ ఎన్నిక
దళితుల అభివృద్ధికి పాటుపడుతా
పదవి రావడంతో నాపై బాధ్యత మరింత పెరిగింది
– కేదాసి మోహన్ స్పష్టం

హైద‌రాబాద్‌, జూలై 27, ( అద్దం న్యూస్ ) :   మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎమ్మార్పీఎస్ ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని బొడ్డు చింతలపల్లి గ్రామానికి చెందిన దళిత రత్న కేదాసి మోహన్ ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఇటీవ‌ల హైదరాబాద్ హబ్సిగూడలో గల ఓ హోటల్‌లో రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సదస్సులో నూతన అధ్యక్షుడిగా కేదాసి మోహన్ మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా కేదాసి మోహన్ గత రెండు దశాబ్దాలకు పైగా మహనీయుల బాటలో పయనిస్తూ మాదిగ సామాజిక వర్గంతో పాటు దళిత, పీడిత, తాడిత, అణగారిన, వెనుకబడిన వర్గాల సమస్యలతో పాటు మహిళలు, మైనార్టీల సమస్యల సాధనే ధ్యేయంగా, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు. ఈ సందర్భంగా కేదాసి మోహన్ మాదిగకు పలువురు అభినందనలు తెలుపారు. అలుపెరుగని నేతగా పేరుగాంచిన కేదాసి మోహన్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి రావడంతో ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి కొత్త ఊపు వస్తుందని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేదాసి మోహన్ మాదిగ మాట్లాడుతూ… మాదిగలతో పాటు దళిత, బహుజన వర్గాల సమస్యల పరిష్కారానికి పోరాడుతూ వారి అభివృద్ధికి పాటుపడతానని ఉద్ఘాటించారు. పదవి రావడంతో తన పై బాధ్యత మరింత పెరిగిందని స్పష్టం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png