గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి
హైదరాబాద్, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) : హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఖైరతాబాద్‌లోని గణేష్ మండపం నుంచి బయల్దేరిన భారీ గణనాథుడు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రెయిన్ నెంబర్ 4 వద్దకు చేరుకోగా.. అక్కడే నిమజ్జనం పూర్తయింది. ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే సమయంలో ఆ ప్రాంతం మొత్తం బై బై గణేశా నినాదాలతో మార్మోగింది. ఈ సారి 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆ బడా గణేష్.. ఇక...